Last Updated:
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష పేరు తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేసే క్రమంలో నిన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, నేడు అన్నాడీఎంకే నేత ఉదయకుమార్ ఆమెపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు.
తమిళనాడు రాజకీయాలు నటి త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సీ.జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష నేతలు ఆమె పేరును వాడుకుంటూ తీవ్ర వివాదాలకు తెరతీస్తున్నారు. కావేరీ జలాల వివాదంపై ప్రభుత్వాన్ని విమర్శించే నెపంతో సీనియర్ అన్నాడీఎంకే నేత ఆర్.బీ. ఉదయకుమార్ త్రిషపై దారుణమైన కామెంట్స్ చేశారు. త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఇస్తారో చూడటానికి యావత్ తమిళనాడు ఎదురుచూస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.














