అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (మే 13, 2026) చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ నేడు, రేపు చర్చలు జరపనున్నారు. ఇరాన్‌పై చైనాకున్న ప్రభావాన్ని ఉపయోగించి, ఆ దేశాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం, వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం వంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ట్రంప్ వెంట ఎలోన్ మాస్క్, టిమ్ కుక్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం.
Source link
Trump Arrives in China | చైనాలో ట్రంప్ ..ఇరాన్ యుద్ధంపై జిన్‌పింగ్‌తో చర్చలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










