Trump Vs Meloni: ట్రంప్ మీ మాటలు జాగ్రత్త.. నేనేం మీతో ఫొటో కోసం అడుక్కోలేదు.. ఇచ్చి పడేసిన మెలోనీ | | ACTPnews

Italian PM Giorgia Meloni (L) with US President Donald Trump at the G7 Summit. (AP)


Last Updated:

జీ7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు వేడుకున్నారన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆమె, ఇటలీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోదని స్పష్టం చేశారు. ఈ వివాదం అమెరికా-ఇటలీ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.

Italian PM Giorgia Meloni (L) with US President Donald Trump at the G7 Summit. (AP)
Italian PM Giorgia Meloni (L) with US President Donald Trump at the G7 Summit. (AP)

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ వేడుకున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు అసత్యమని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.

ప్రపంచ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరుగాంచిన ట్రంప్, ఈసారి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీపై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఒక ఇటాలియన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియన్ నగరంలో జరిగిన జీ7 సమావేశంలో మెలోనీ తనతో ఫోటో దిగేందుకు ఎంతో ఆసక్తి చూపించారని అన్నారు. తనతో మాట్లాడేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నారని, తనతో ఒక ఫోటో కోసం పదేపదే ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. తాను సాధారణంగా ఫోటోలు దిగనప్పటికీ, ఆమెపై జాలి వేసి అంగీకరించానని కూడా చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన జార్జియా మెలోనీ, ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ, “డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం, అబద్ధం. అమెరికా అధ్యక్షుడు తన మిత్ర దేశాల నాయకుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఆయన మొదటిసారి చేస్తున్న పని కాదు” అని అన్నారు.

అంతేకాకుండా, ట్రంప్ తన మిత్రులను అవమానించడంలో ముందుంటారని, కానీ పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు, నియంతల విషయంలో మాత్రం మృదువుగా వ్యవహరిస్తారని విమర్శించారు. “నేను, నా దేశం ఇటలీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోదు, భిక్ష అడగదు” అని మెలోనీ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యల తర్వాత వివాదం మరింత ముదిరింది. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధంగా కాకుండా, రెండు దేశాల దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఇటలీ ఉప ప్రధానమంత్రి అంటోనియో తజానీ జూన్ 21, 22 తేదీల్లో జరగాల్సిన తన అధికారిక అమెరికా పర్యటనను తక్షణమే రద్దు చేసినట్లు సమాచారం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *