ఈ ప్రత్యేక శిక్షణా శిబిరంలో వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీ వివిధ విభాగాల నిపుణులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, శ్రీవారి వైభవం, పూజలు, కైంకర్యాల విశిష్టతలను విపులంగా వివరించారు. లడ్డూ కౌంటర్లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, కల్యాణకట్ట, వైకుంఠం క్యూకాంప్లెక్స్, రిసెప్షన్ కేంద్రాలను స్వయంగా సందర్శించిన శిక్షణార్థులు.. క్షేత్రస్థాయిలో భక్తుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్షంగా నైపుణ్యాలు నేర్చుకున్నారు. ప్రతి బ్యాచ్‌లోని దాదాపు 200 మందికి శిక్షణతో పాటు ట్రైనింగ్ కిట్, గ్రూప్ సూపర్వైజర్ మాన్యువల్, గోవింద నామాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామం, శ్రీనివాస గాథ తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను అధికారులు అందజేశారు.













