Upendra: అక్కడ విజయ్, ఇక్కడ ఉపేంద్ర.. సీఎం కుర్చీపై శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కన్నడ స్టార్ హీరో, ‘శివన్న’గా పిలవబడే శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

News18
News18

కన్నడ స్టార్ హీరో, ‘శివన్న’గా పిలవబడే శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) బెంగళూరు ప్రమోషన్ల ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోటి నటుడు, విలక్షణ దర్శకుడు ఉపేంద్ర రాజకీయ భవిష్యత్తుపై శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు ‘దళపతి’ విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ద్వారా సాధించిన అఖండ విజయాన్ని, ఆయనకు లభించిన ప్రజాదరణను శివరాజ్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నటుడు విజయ్‌ను ప్రజలు అంతలా ఆదరించి గెలిపించినప్పుడు.. కర్ణాటకలో మన ఉపేంద్రకు అలాంటి మద్దతు ఎందుకు ఇవ్వకూడదు? భవిష్యత్తులో ఉపేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని శివన్న వ్యాఖ్యానించారు.

నటీనటులు కేవలం వెండితెరపై మాత్రమే ముఖానికి రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో రంగులు మార్చరని, ఎంతో నిజాయతీగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఉపేంద్ర ఇప్పటికే ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ (UPP) ద్వారా రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

మాకు పబ్లిసిటీ అవసరం లేదు.. ప్రత్యక్ష రాజకీయాలపై క్లారిటీ:

సమాజంలో మంచి పనులు చేయడానికి ఎప్పుడూ వార్తాపత్రికల కవరేజ్, ప్రచారం లేదా మీడియా పబ్లిసిటీ అవసరం లేదని శివరాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. చేసే పనిలో నిజాయతీ ఉంటే ప్రజలే గుర్తిస్తారని, దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. తమ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబం ఎప్పటి నుంచో ఎలాంటి ప్రచారం కోరుకోకుండా సామాన్యులకు సేవ చేస్తోందని గుర్తు చేశారు.

అయితే, తనకు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఈ సందర్భంగా శివన్న పూర్తి స్పష్టత ఇచ్చారు. తమ అభిమానులు కూడా రాజకీయాల కోసం కాకుండా, సమాజంలో నలుగురికీ సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *