US-Iran: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్‌తో నెతన్యాహు అర్జెంట్ మీటింగ్! | | ACTPnews

ట్రంప్, నేతన్యాహూ


Last Updated:

ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘సీఎన్ఎన్’ (CNN) కథనం ప్రకారం.. మారుతున్న ఈ వ్యూహాత్మక పరిణామాలు మరియు ప్రాంతీయ భద్రతపై ఇజ్రాయెల్ అభ్యంతరాలను, తమ స్పష్టమైన వైఖరిని ట్రంప్‌కు వివరించేందుకు నెతన్యాహు ఈ అర్జెంట్ మీటింగ్ కోరుతున్నారు.

ట్రంప్, నేతన్యాహూ
ట్రంప్, నేతన్యాహూ

US-Iran: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 (G7) సదస్సు ముగించుకొని రాగానే ఆయనతో అత్యవసరంగా సమావేశం కావాలని భావిస్తున్నారు. ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘సీఎన్ఎన్’ (CNN) కథనం ప్రకారం.. మారుతున్న ఈ వ్యూహాత్మక పరిణామాలు మరియు ప్రాంతీయ భద్రతపై ఇజ్రాయెల్ అభ్యంతరాలను, తమ స్పష్టమైన వైఖరిని ట్రంప్‌కు వివరించేందుకు నెతన్యాహు ఈ అర్జెంట్ మీటింగ్ కోరుతున్నారు.

ముఖ్యంగా ఈ చర్చలలో లెబనాన్ సరిహద్దులో ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యల భవిష్యత్తు ఏంటనేది ప్రధానాంశంగా మారనుంది. వాషింగ్టన్, టెహ్రాన్‌లు సంయుక్తంగా ప్రకటించిన ఈ తాజా శాంతి ఫ్రేమ్‌వర్క్ మరియు ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి పునఃప్రారంభ నిర్ణయం ఇజ్రాయెల్‌కు తీవ్ర కలవరాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈ చర్చలలో ఇజ్రాయెల్‌కు ఎలాంటి భాగస్వామ్యం లేదు.

నెతన్యాహు చాలా మొండివాడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ఇజ్రాయెల్ మరియు వాషింగ్టన్ మధ్య ఉన్న విభేదాలను ఎత్తిచూపుతూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రఖ్యాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ (The New York Times) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ నెతన్యాహుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

“నెతన్యాహు చాలా మొండివాడు (A very difficult guy). నిజం చెప్పాలంటే, మేము ఇరాన్‌తో ఈ శాంతి ఒప్పందాన్ని కుదురుస్తున్నందుకు ఆయన మాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒకవేళ ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని తయారు చేసి ఉంటే.. ఇజ్రాయెల్ ఉనికి రెండు గంటలు కూడా ఉండేది కాదు,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఒప్పందం కుదరకపోతే ‘మిడిల్ ఈస్ట్ గార్డియన్’ గా అమెరికా.. ట్రంప్ కండిషన్!

ఒకవేళ రాబోయే 60 రోజుల చర్చల గడువులోగా ఇరాన్ గనుక అమెరికాతో తుది అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైతే, తాను ఊరుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అప్పుడు ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులను ప్రారంభిస్తామని లేదా పశ్చిమ ఆసియా (Middle East) దేశాల రక్షణ బాధ్యతలను అమెరికా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటుందని చెప్పారు. అయితే అందుకు ప్రతిఫలంగా ఆయా దేశాల మొత్తం ఆదాయంలో 20 శాతం (20% of revenues) వాటాను అమెరికాకు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ ఒక వింతైన కండిషన్ పెట్టారు.

అలాగే తాము ఇరాన్‌తో కుదుర్చుకున్న ఈ ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. భవిష్యత్తులో ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకలపై ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా శాశ్వతంగా ఉచిత రవాణా సాగేలా చూస్తామని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports