Vanda Devullu Review: విజయ్ ఆంటోనీ వంద దేవుళ్ళు రివ్యూ.. హైప్ ఓకే కానీ, సినిమా పరిస్థితి ఏంటి? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘బిచ్చగాడు’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా వంద దేవుళ్ళు. నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

News18
News18

‘బిచ్చగాడు’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అనగానే ‘వంద దేవుళ్ళు’ (తమిళంలో నూరు సామి) చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. సమాజంలో ఒక వితంతువు ఎదుర్కొనే సమస్యలు, ఆమెకు రెండో పెళ్లి చేయాలనుకునే కొడుకుల కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఆ హైప్‌ను నిలబెట్టుకుందా? సినిమా పరిస్థితి ఏంటో ఈ విశ్లేషణతో చూద్దాం.

సున్నితమైన కథాంశం: కాలం మారినా సమాజంలో వితంతువుల పట్ల ఉన్న కట్టుబాట్లు, వివక్ష మారలేదని చాటిచెప్పిన విధానం బాగుంది. 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘మా నాన్నకు పెళ్లి’ కాన్సెప్ట్‌ను జెండర్ స్వాప్ చేసి, అమ్మకు తోడు కావాలని కొడుకు ఆలోచించే పాయింట్ మనసును తాకుతుంది. తల్లి వాసవి పాత్రలో శ్వాసిక ఒదిగిపోయింది. ఒక వితంతువుగా ఆమె పలికించిన హావభావాలు, భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం. పెద్ద కొడుకుగా నటించిన అజయ్ దీషన్ (విజయ్ ఆంటోనీ మేనల్లుడు) డెబ్యూ అయినా మెప్పించాడు.

ఫస్టాఫ్ పర్వాలేదు, సెకండాఫ్ లో విజయ్ ఆంటోనీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ముఖ్యంగా చివరి అరగంట ఉత్కంఠగా, కాస్త కామెడీగా సాగుతూ సినిమాను సేఫ్ జోన్‌లోకి నెట్టే ప్రయత్నం చేసింది. సినిమాలోని హార్ట్ టచింగ్ డైలాగ్స్ కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. అయితే ఈ సినిమాకు అతిపెద్ద డ్రాబ్యాక్ ప్రమోషన్స్ అన్నీ విజయ్ ఆంటోనీ చుట్టూనే చేసినా, సినిమాలో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. హీరో పాత్ర కేవలం ఒక గెస్ట్ అప్పీరెన్స్ లాగా మాత్రమే అనిపిస్తుంది, ఇది థియేటర్‌కు వచ్చే సగటు ప్రేక్షకుడిని తీవ్రంగా నిరాశపరుస్తుంది.

దర్శకుడు శశి ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా, దాన్ని తెరపై చూపించడంలో చాలావరకు తడబడ్డారు. ఫస్ట్‌హాఫ్‌లో పాయింట్ లోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు. సీన్లు సాగదీసినట్లు ఉండి, పదే పదే ఒకే తరహా ఎమోషన్స్ రిపీట్ అవ్వడం వల్ల బోర్ కొడుతుంది. సినిమా అంతా సహజత్వానికి దగ్గరగా సాగుతున్నట్లు అనిపించినా, కొన్ని సీన్లు మరీ పాతకాలపు తమిళ సీరియళ్లను గుర్తుచేస్తాయి. ఇలాంటి సాగదీత సీన్లకు నేటి తరం ఆడియన్స్‌ కనెక్ట్ కావడం కష్టమే.

ఇదొక ప్యూర్ క్లాస్, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులు ఆశించి వెళ్తే నిరాశ తప్పదు. పైగా కొన్ని చోట్ల డబ్బింగ్ సింక్ సరిగ్గా కుదరలేదు. ‘వంద దేవుళ్ళు’ సినిమాలో మంచి సందేశం, బలమైన పాయింట్ ఉన్నప్పటికీ.. నెమ్మదించిన కథనం, విజయ్ ఆంటోనీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉండటం సినిమా గ్రాఫ్‌ను తగ్గించేసింది. ‘బిచ్చగాడు’ రేంజ్ మ్యాజిక్ ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. కేవలం ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రమే ఇది ఓ మోస్తరుగా నచ్చుతుంది. అసలు ఈ సినిమాకు వంద దేవుళ్ళు అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చాలా మందికి అర్థం కాకపోవచ్చు.

రేటింగ్: 2.25

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *