Venkatesh: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో దసరా ఊచకోత! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

News18
News18

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ధృవీకరించినట్లు సమాచారం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’లో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే 2025లో వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏకే 47’ (AK 47) అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వెంకటేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా సినిమా వివరాలను ప్రకటిస్తూ షూటింగ్ ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఫస్ట్ లుక్‌ను చూస్తే పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే, వెంకటేష్ ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో కూడా బిజీగా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నందమూరి కళ్యాణ్ రామ్, వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. తాత్కాలికంగా ‘వెంకీఅనిల్5’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 18న హైదరాబాద్‌లో సాంప్రదాయ ముహూర్తపు పూజలతో ప్రారంభమైంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

సురేష్ ప్రొడక్షన్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ కనిపించారు. అలాగే కీర్తి సురేష్‌తో పాటు కృతి శెట్టి కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు ప్రకటించారు. “వెంకీఅనిల్5 – ఎన్‌కేఆర్‌ఏఆర్2 స్టైలిష్‌గా ప్రారంభమైంది. కీర్తి సురేష్, కృతి శెట్టికి స్వాగతం” అంటూ పోస్ట్ చేయగా అభిమానులు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

ఒకవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’, మరోవైపు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌తో వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రెండు చిత్రాలూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్‌లో ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన తదుపరి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports