నయనతారపై ప్రశంసల జల్లు ఇదే క్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతారపై సోనా ప్రశంసలు కురిపించారు. “నాకు నయనతార అంటే చాలా ఇష్టం, ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. నా లాగే ఆమె కూడా తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఆటంకాలను, కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ అవ్వడం వంటి ఎన్నో చేదు జ్ఞాపకాలను దాటుకుని వచ్చింది. వాటన్నింటినీ తట్టుకుని నిలబడి, ఇప్పుడు ఒక అందమైన, పరిపూర్ణమైన కుటుంబాన్ని నిర్మించుకుంది. ఆమె జీవితంలో స్థిరపడటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది” అని సోనా చెప్పుకొచ్చారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’ వంటి సినిమాల్లో నటించిన సోనా హైడెన్, ఎక్కువగా ఐటెం సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.













