Vijay: ‘జననాయగన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందా?.. సీఎం బర్త్‌డే‌కు ఊచకోతే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘భగవంత్ కేసరి’ సినిమాకు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమాకు ఇప్పుడు మళ్లీ ప్రాణం వచ్చింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ దెబ్బకు ఉలుకూ పలుకూ లేకుండా పోయింది.

News18
News18

‘భగవంత్ కేసరి’ సినిమాకు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమాకు ఇప్పుడు మళ్లీ ప్రాణం వచ్చింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ దెబ్బకు ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక తమిళనాట పెద్ద సంచలనమే సృష్టించింది. ట్రైలర్‌లో చాలా డైలాగ్స్ రాజకీయం పరంగా వివాదాస్పదం అయ్యాయి. దాంతో సెన్సార్ వరకు వెళ్లిన ఈ సినిమాను అక్కడే సంకెళ్లు వేసి బంధించేశారు.

మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సినిమా మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. ఆ తర్వాత ఫ్రిబవరిలో రిలీజవుతుందంటూ మేకర్స్ విజయ్ అభిమానులను కాస్త చల్లబరిచారు కానీ… కానీ మళ్లీ సెన్సార్ నుంచి, రాజకీయ నాయకుల అభ్యంతరాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా అక్కడే కదల్లేని స్థితిలో ఉండిపోయింది. ఇక కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ప్రాణం వచ్చినంత పనైంది. ఎవరూ ఊహించిన రేంజ్‌లో విజయ్ తమిళనాడు కొత్త సీఎంగా జెండా పాతేసీ.. ఇప్పుడు తన ఈ సినిమాకు రూటు క్లియర్ చేశాడు.

తాజా ఫిల్మ్ నగర్ బజ్ ప్రకారం.. విజయ్ అభిమానుల పండగ చేసుకునే ఒక అద్భుతమైన సీజన్‌ను ఈ సినిమా విడుదల కోసం చిత్రబృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుట్టినరోజు వేడుకలకు సరిగ్గా మూడు రోజుల ముందే, అంటే జూన్ 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే ‘డిస్ట్రిక్ట్’ (District) వంటి ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా రిలీజ్ డేట్ జూన్ 19గా చూపిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దాదాపు ఈ డేట్ ఫిక్స్ అయినట్లే అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, దీనిపై నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ పూర్తి క్లారిటీ రాదు. ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్స్ ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. ముందుగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ సంస్థ కొనుక్కుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు నోచుకోకపోవడం.. రకరకాలు ఇబ్బందులు వెంటాడటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో తప్పుకుంది. ఇక ఇప్పుడు విజయ్ సీఎం అవడంతో ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్స్ వస్తున్నాయట.

అయితే… మేకర్స్ మాత్రం జీ5 వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఆఫర్ చేసిన దానికంటే జీ5 చాలా ఎక్కువ రేటుకు డీల్‌ను కుదరించుకునే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. తెలుగులో అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి సినిమా అఫిషియల్ రీమేక్‌గా జననాయగన్ తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమిత బైజు కీలక పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పోషించిన రోల్ మమిత బైజు చేస్తుంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed