Vijay Antony: విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’.. దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ఇప్పుడు ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటించారు.

News18
News18

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ఇప్పుడు ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీని నవంబర్ 6న విడుదల చేయబోతోన్నారు. దీపావళి సెలవులు కలిసి వచ్చేలా ఈ మూవీ రిలీజ్‌ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లను గమనిస్తే.. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ని ప్రధానంగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది.

ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.

యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. నవంబర్ 6న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. విజయ్ ఆంటోని సంగీతం అందిస్తుండటం విశేషం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed