Viral: 90 ఏళ్ల వయసులోనూ కండల వీరుడే.. మాంసం ముట్టకుండానే బాడీ ఎలా మెయిన్‌టెన్ చేశాడో తెలుసా! | ట్రెండింగ్ | ACTPnews

News18


Last Updated:

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని 90 ఏళ్ల జపాన్ బాడీబిల్డర్ తోషిసుకే కనజావా నిరూపించారు. గత 40 ఏళ్లుగా మాంసం, చేపలు ముట్టకుండానే సాధారణ ఆహారంతో ఆల్ జపాన్ మాస్టర్స్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్‌లో 19వ జాతీయ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించారు.

News18
News18

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని జపాన్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధ బాడీబిల్డర్ తోషిసుకే కనజావా ప్రపంచానికి మరోసారి నిరూపించారు. హిరోషిమా నగరానికి చెందిన ఆయన తన 90వ పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజే ‘ఆల్ జపాన్ మాస్టర్స్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్’ పోటీల్లో 85 ఏళ్లకు పైబడిన విభాగంలో విజేతగా నిలిచారు. తద్వారా తన సుదీర్ఘ కెరీర్‌లో 19వ జాతీయ టైటిల్ కైవసం చేసుకుని సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఎలాంటి స్టెరాయిడ్స్ వాడకుండా, గత 40 ఏళ్లుగా మాంసం, చేపలు ముట్టకుండా కేవలం సాధారణ ఆహారంతోనే ఆయన ఈ ఉక్కులాంటి శరీరాన్ని నిర్మించుకోవడం విశేషం.

1936లో జన్మించిన కనజావా తొలుత ఒలింపిక్ స్విమ్మర్ కావాలని కలలు కన్నప్పటికీ, కండరాల సమస్యతో బాడీబిల్డింగ్ వైపు అడుగులు వేశారు. 24 ఏళ్ల వయసులోనే మిస్టర్ జపాన్ టైటిల్ గెలిచిన ఆయన, 1967లో దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌తో కలిసి మిస్టర్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానం సాధించారు.

మాంసం ముట్టని ఆహార నియమాలు, కఠిన వ్యాయామం

కనజావా తన 50వ ఏట నుంచి మాంసం, చేపలు తినడం పూర్తిగా మానేశారు. జీవితంలో ఎప్పుడూ మద్యం, ధూమపానం అలవాటు లేని ఆయన ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో బ్రౌన్ రైస్ (ముడి బియ్యం అన్నం), పులియబెట్టిన సోయాబీన్స్‌తో చేసే ‘నాట్టో’, రెండు పచ్చి గుడ్లు కలిపిన మిసో సూప్ తీసుకుంటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలోనూ బ్రౌన్ రైస్‌పై జపాన్ మసాలా పొడి ‘ఫురికాకే’ చల్లుకుని తింటారు. గతంలో రోజుకు ఆరు ప్రోటీన్ షేక్‌లు తాగే ఆయన, ప్రస్తుతం వయసు రీత్యా అరుగుదల కోసం రోజుకు మూడు సార్లు మాత్రమే ప్రోటీన్ డ్రింక్ తాగుతున్నారు.

ఈ వయసులోనూ వారానికి ఆరు రోజులు రోజుకు రెండు గంటల పాటు జిమ్‌లో మెషీన్లతో కసరత్తులు చేస్తూ, రాత్రి ఏడు గంటలు ప్రశాంతంగా నిద్రపోతారు. “వృద్ధాప్యాన్ని మనం ఆపలేం కానీ సరైన ఆహారం, వ్యాయామంతో దాన్ని నెమ్మదింపజేయవచ్చు” అని ఆయన చెబుతున్నారు.

వాస్తవానికి 34 ఏళ్ల వయసులోనే కనజావా బాడీబిల్డింగ్ నుంచి రిటైర్ అయ్యారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యలో మనోధైర్యం నింపేందుకు, తాను పోటీల్లో గెలిస్తే ఆమె సంతోషిస్తుందనే ఉద్దేశంతో 50 ఏళ్ల వయసులో మళ్లీ బాడీబిల్డింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆ ప్రయాణాన్ని ఆపకుండా 80 ఏళ్లు దాటాక ఆరు ప్రపంచ మాస్టర్స్ టైటిళ్లు గెలిచారు. తాను 130 ఏళ్ల వరకు జీవించాలని, తన అభిమాన హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ను స్వయంగా కలిసి తన సత్తా చూపించాలన్నదే తన లక్ష్యమని కనజావా ధీమాగా చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed