Viral Video: జువెలరీ షాపులో డైమండ్ నెక్లెస్ మాయం.. సీసీ ఫుటేజ్‌కి చిక్కిన కంటికి కనిపించని దొంగ | ట్రెండింగ్ | ACTPnews

VIRAL


Last Updated:

Viral Video: నగల దుకాణం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగింది. అయితే జువెలరీ షాపు తలుపులు పగలగొట్టడం రెక్కీ నిర్వహించడం, సెక్యూరిటిపై దాడి చేయడం వంటివి ఏమి జరగలేదు. కనీసం నగల షాపు తలుపులు కూడా తెరవకుండానే వజ్రాల హారం అపహరణకు గురైంది.

+

VIRAL VIDEO

Viral Video: బంగారు నగల దుకాణంలో దొంగలు పడితే అంతా ఊడ్చుకెళ్తారు. కాని విచిత్రం ఏమిటంటే కర్నాటకలో జరిగిన ఓ జువెలరీ చోరీ కేసులో కేవలం ఒక్క వజ్రాల హారం మాత్రమే చోరికి గురైంది. నగల దుకాణం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగింది. అయితే జువెలరీ షాపు తలుపులు పగలగొట్టడం రెక్కీ నిర్వహించడం, సెక్యూరిటిపై దాడి చేయడం వంటివి ఏమి జరగలేదు. కనీసం నగల షాపు తలుపులు కూడా తెరవకుండానే వజ్రాల హారం అపహరణకు గురైంది. కర్నాట రాష్ట్రం తుమకూరులోని ఓ నగల షాపులో రూ.10 లక్షల విలువైన వజ్రాల ఆభరణం కనిపించకుండా పోయింది. ఎవరు తీసుకెళ్లారని షాపు యజమాని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే చోరీ చేసింది ఎవరో తెలిసి షాక్ అయ్యారు. ఇప్పుడు

కంటికి కనిపించని దొంగ..

అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈవార్త కర్ణాటకలోని తుమకూరులో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని కాల్టెక్స్ సర్కిల్ సమీపంలో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో సుమారు రూ.10 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణం మాయం అయింది. షాపు మూసివేసిన తర్వాత సైలెంట్‌గా జువెలరీలో నక్కి ఉన్న ఎలుక ఈ నగల హారాన్ని ఎత్తుకెళ్లడం ఆశ్చర్యకరమైన విషయం. ఎలుక నగల హారం ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే మరుసటి రోజు ఉదయం దుకాణం తిరిగి తెరిచేలోపే 50 గ్రాములకు పైగా వజ్రాలు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయి.

నగల షాపులో ఎలుక చోరీ..

అయితే షాపు యజమాని గోల్డ్ నగల కౌంట్ ప్రకారం ఒక హారంతో పాటు వజ్రాలు మాయం కావడంతో జువెలరీలో అణువణువు పరిశీలించారు. అయితే ఇది దొంగల పని కాదని తేలిపోయింది. ఎందుకంటే తలుపులు పగలగొట్టినట్లు, లాకర్స్ ఓపెన్ చేసిన ఆనవాళ్లు లేవు. కనీసం షాపు షట్టర్ చెక్కుచెదరలేదు. ప్రాంగణంలోకి ఎవరూ ప్రవేశించలేదు. అయినప్పటికీ సుమారు రూ.10 లక్షల విలువైన గొలుసులు, ఉంగరాలు రహస్యంగా అదృశ్యమవ్వడంతో యజమాని, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.

నగలు రికవరీ..

తమ షాపులో రూ.10 లక్షల విలువైన సొత్తు పోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. అంతకంటే ముందు షాపులో అమర్చిన సీసీ ఫుటేజ్ పరిశీలించారు సిబ్బంది. అక్కడే అసలు దొంగ దొరికిపోయాడు. విచిత్రం ఏమిటంటే నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లింది దొంగ కాదు ఓ ఎలుక అని నిర్ధారించుకొని షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో ఆ ఎలుక ఆభరణాలను ఒక్కొక్కటిగా తీసుకెళ్లి తన బొరియలో దాచిపెడుతున్నట్లు కనిపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఎలుక కదలికలను అనుసరించి, నగల దుకాణం సిబ్బంది తర్వాత దాని బొరియను తవ్వి, పోయిన ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 ఉంగరాలు, మూడు గొలుసులు లభ్యం కావడంతో నగల షాపు ఓనర్‌ ఊపిరి పీల్చుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports