Last Updated:
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం కృతి శెట్టి. మరి ఆ సంగతేంటో చూద్దామా..
టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్, ‘దర్శకేంద్రుడు’ కే రాఘవేంద్రరావు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ సినీ వేడుకల్లో హీరోయిన్లు, మహిళా సెలబ్రిటీలతో ఆయన ప్రవర్తిస్తున్న తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక (పూజా కార్యక్రమం) గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదానికి దారితీసింది.
ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టితో రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఆమె అనుమతి లేకుండా, కృతి శెట్టి భుజాలపై ఆయన చేతులు వేయడం, ఆ తర్వాత ఇతర నటీమణుల చేతులు పట్టుకుని మాట్లాడటం వంటి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. “పేరు గొప్ప.. ఊరు దిబ్బ” అన్నట్లుంది దర్శకేంద్రుడి వ్యవహారం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కాబట్టి ఇవన్నీ కామన్ అనుకోవడానికి వీల్లేదని, ఏ మహిళనైనా తాకాలంటే కనీస అనుమతి ఉండాలని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.
ఈ వివాదం కాస్తా ముదరడంతో, గతంలో మెగా డాటర్ నిహారిక కొణిదెలతో జరిగిన ఒక పాత సంఘటనను నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో ఒక ఈవెంట్‌లో నిహారికతో కూడా రాఘవేంద్రరావు ఇలానే ప్రవర్తించారని, అప్పట్లోనూ ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఆ పాత వీడియోను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేస్తూ.. “అసలు ఈ ముసలాయన ఎవరు? మహిళల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు ఈయనకు ఎవరు ఇచ్చారు?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఈ పోస్ట్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పదే పదే హీరోయిన్లపై చేతులు వేయడం కరెక్ట్ కాదని, వయసుకు తగినట్లు గౌరవంగా నడుచుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కూతురితో ..
వృధ దర్శకుడు రాఘవేంద్ర రావు చౌదరి వెకిలి చేష్టలు..
ఇబ్బంది పడ్డ నిహారిక!
వీడియో వైరల్ #viralvideo #NiharikaKonidela #RaghavendraRao #UANow pic.twitter.com/k7NKOLbdUg
— UttarandhraNow (@UttarandhraNow) November 10, 2025
చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు:
మరోవైపు, ఈ వివాదంపై చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. రాఘవేంద్రరావు ఇండస్ట్రీలో దశాబ్దాల కాలంగా ఎందరో హీరోయిన్లను స్టార్స్‌గా మార్చారని, అది కేవలం ఆయనకున్న ఆప్యాయత, సినిమా రంగంలో షూటింగ్ ప్రక్రియలో భాగమైన చనువు మాత్రమేనని కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, మారుతున్న కాలంతో పాటు మహిళల వ్యక్తిగత స్పేస్ (Personal Space) పట్ల గౌరవం పెరగాల్సిన అవసరం ఉందనే కోణంలో సోషల్ మీడియాలో ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 19, 2026 12:33 PM IST













