Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హైదరాబాద్‌లో సెకన్ల వ్యవధిలో ఘోరం, నమ్మలేని సీసీటీవీ దృశ్యాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సెకన్ల వ్యవధిలో ఘోరం, నమ్మలేని సీసీటీవీ దృశ్యాలు!


Last Updated:

సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు చూస్తే అస్సలు నమ్మలేరు. స్కూటర్ మీద పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సెకన్ల వ్యవధిలో ఘోరం, నమ్మలేని సీసీటీవీ దృశ్యాలు!
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సెకన్ల వ్యవధిలో ఘోరం, నమ్మలేని సీసీటీవీ దృశ్యాలు!

పిల్లలను పాఠశాలకు దింపే తొందరలో తల్లిదండ్రులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో తెలిపే షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉరుకులు పరుగుల జీవితంలో క్షణకాలం పాటు చేసే ఆదమరపు ఏకంగా ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ద్విచక్ర వాహనాలపై పిల్లలను ఎక్కించుకుని వెళ్లేటప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయకుండా వదిలేయడం అత్యంత ప్రమాదకరమని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న ఓ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది.

సజ్జనార్ పంచుకున్న ఆ వీడియోలో ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను స్కూటర్‌పై పాఠశాలకు తీసుకువెళ్లాడు. స్కూల్ గేటు వద్ద బండి ఆపిన ఆయన.. తన కుమారుడిని లోపలికి పంపేందుకు కిందకు దిగాడు. ఆ సమయంలో బండి ఇంజిన్ ఆన్‌లోనే ఉంది. వెనుక కూర్చున్న చిన్నారి పాప సరదాగా బండి హ్యాండిల్ పట్టుకుంది. ఆ చిన్నారికి తెలియకుండానే యాక్సిలరేటర్ రైజ్ చేయడంతో ఆ స్కూటర్ అమాంతం వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఆ వేగానికి పాప కొద్ది మీటర్ల దూరంలో కింద పడిపోయింది. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనతో ఆ తండ్రి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.

ఇది కూడా చదవండి: Hyderabad News: గంజాయి మత్తు.. అమ్మాయి మోజు.. మర్మాంగాలు నలిపేసి.. ఊహించని రేంజ్‌లో మర్డర్!

ఈ దృశ్యాలు చూస్తుంటే క్షణకాలం పాటు చూపే అప్రమత్తత లోపం జీవితకాలపు వేదనకు ఎలా దారితీస్తుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాన్ని ఆపినప్పుడు పిల్లలను దానిపైనే ఉంచి ఇంజిన్ ఆన్‌లో ఉంచడం లేదా పిల్లలు పక్కనే ఉన్నప్పుడు అజాగ్రత్తగా వ్యవహరించడం ఎంతటి తీవ్రమైన ముప్పును తెస్తుందో ఈ సీసీటీవీ ఫుటేజ్ స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం సెకన్ల వ్యవధిలో ఊహించని విపత్తులు చోటుచేసుకుంటాయని, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం అలసత్వం పనికిరాదని సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Jobs: నెలకు రూ.54 వేల జీతం.. సొంత జిల్లాలోనే ఉద్యోగం!

సాధారణంగా చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనం ఎక్కడం, దానిపై ప్రయాణించడం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా యాక్సిలరేటర్‌ను తిప్పడం వారికి ఒక ఆట లాంటిది. కానీ, బండి ఇంజిన్ స్టార్ట్ చేసి ఉన్నప్పుడు ఆ చిన్నారులు ఏమీ తెలియక చేసే ఒక చిన్న పొరపాటు ఊహించని రీతిలో ఘోర ప్రమాదంగా మారుతుందని సజ్జనార్ వివరించారు. క్షణాల్లోనే అది వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల అమాయకత్వం, పెద్దల అజాగ్రత్త కలిస్తే ఎలాంటి విషాదాలు జరుగుతాయో ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చని ఆయన సూచించారు.

కళ్ల ముందే రెప్పపాటులో జరిగే ఇలాంటి ఘోరమైన ప్రమాదాలను నివారించాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని సజ్జనార్ ఉద్ఘాటించారు. స్కూల్ వద్ద బండి ఆపిన వెంటనే ముందుగా ఇంజిన్ ఆఫ్ చేసి తాళం తీయాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లో ఉన్న వాహనాలపై ఒంటరిగా వదిలేయకూడదని సూచించారు. ఎంక తొందరలో ఉన్నప్పటికీ పిల్లల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఓ గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తల్లిదండ్రులకు హితవు పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed