Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

2027 వన్డే వరల్డ్ కప్ ఆడటంపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడటానికి సిద్ధమే కానీ, ఎవరికీ సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేని వాతావరణం ఉంటేనే బరిలోకి దిగుతానని, నమ్మకం లేని చోట ఉండనని తేల్చి చెప్పాడు.

News18
News18

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఎవరికీ ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని వాతావరణం ఉంటేనే ఆడతానని స్పష్టం చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న 37 ఏళ్ల కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పాడ్‌కాస్ట్‌లో తన మనసులోని మాటను బయటపెట్టాడు. “నేను జట్టుకు ఏ మేరకు ఉపయోగపడతానో నాకు తెలుసు. నా వాల్యూను గుర్తించే వాతావరణం ఉంటేనే నేను అక్కడ ఉంటాను. కానీ, ప్రతీసారి నా సత్తా నిరూపించుకోవాలని ఎవరైనా భావిస్తే మాత్రం ఆ వాతావరణంలో నేను ఉండలేను” అని కోహ్లీ తేల్చి చెప్పాడు. తాను ఆట కోసం ఎంత కష్టపడతానో, ప్రతీ మ్యాచ్‌ను ఎలా సీరియస్‌గా తీసుకుంటానో అందరికీ తెలుసన్నాడు.

వన్డే క్రికెట్‌లో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయమన్నా ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా చేస్తానని కోహ్లీ స్పష్టం చేశాడు. తాను ప్రతీ బంతిని తన కెరీర్‌లో ఆడే చివరి బంతిలా భావించి ఆడుతానని, జట్టు కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధమని తెలిపాడు. కానీ, ఇదంతా చేసిన తర్వాత కూడా ఎవరైనా తనను అనుమానిస్తే ఆ ప్లేస్‌లో తాను ఉండనని కరాఖండిగా చెప్పాడు.

ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాపై వరుసగా సెంచరీలు చేసిన సమయంలో తన మైండ్‌సెట్ ఎలా ఉందో కూడా కోహ్లీ వివరించాడు. ఎవరికీ ఏదీ నిరూపించుకోవడానికి కాకుండా, కేవలం ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడానని చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆడినప్పుడు కూడా చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేశానని గుర్తుచేసుకున్నాడు.

“మీపై మాకు నమ్మకం ఉందంటూనే, వారం తర్వాత మన పనితీరును ప్రశ్నించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నమ్మకం ఉంటే సైలెంట్‌గా ఉండాలి. ఫలితాలను బట్టి మాటలు మార్చకూడదు” అని కోహ్లీ ఘాటుగా సమాధానమిచ్చాడు. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటానని, ఏ సిరీస్‌కు ముందు రెండు మూడు వారాలు హడావిడిగా కష్టపడనని, ఏడాది పొడవునా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటానని వివరించాడు. “నేను నా ఇల్లు వదిలి ఎందుకు వస్తాను? ఆడుతున్నానంటే క్రికెట్ కోసం, ఇండియాకు వరల్డ్ కప్ తీసుకురావాలనే లక్ష్యంతోనే వస్తాను” అని కోహ్లీ ముగించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *