“ఒకరితో కలిసి జీవించలేకపోయామంటే వారిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. మంచి జ్ఞాపకాలను, మంచి మనుషులను ఎందుకు కోల్పోవాలి?” అంటూ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ప్రేమ, స్నేహం, అనుబంధాలపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొందరిని ఆశ్చర్యపరుస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె ఆలోచనలను ప్రశంసిస్తున్నారు. ప్రేమ అనేది విడిపోయిన తర్వాత కూడా గౌరవం, స్నేహం రూపంలో కొనసాగుతుందని విష్ణుప్రియ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.













