VVS Laxman: బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ బోర్డులో మరింత కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనను ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

News18
News18

బీసీసీఐలో కీలక ప్రక్షాళన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ సెప్టెంబర్‌లో జరగనున్న బోర్డు సమీక్షలో పలు కీలక పదవుల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు బోర్డులో ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం వచ్చిందని అవుట్‌లుక్ ఇండియా కథనం పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతిగా ఉన్న ఆయనకు, ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ (Director of Cricket) గా బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *