YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు!



తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ను ‘సకలశాఖ మంత్రి’ అంటూ ఎద్దేవా చేసిన ఆమె, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న మహిళా రిజర్వేషన్లకు తామేదో ముందే చేశామన్నట్లు లోకేష్ అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా భద్రత గురించి మాట్లాడే ముందు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *