ఆకలి రాజ్యం 2026 రివ్యూ.. బీటెక్ పట్టభద్రుల కష్టాలను అద్దంపట్టే సినిమా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టెక్ లేఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, సరైన ఉపాధి అవకాశాలు లేక దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీటెక్ పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు ప్రధానాంశంగా వచ్చిన సిరీస్ ఆకలి రాజ్యం 2026. మరి ఈ సిరీస్ ఎలా ఉందొ చూద్దాం.

News18
News18

కమల్ హాసన్ నటించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘ఆకలి రాజ్యం’ 1980ల నాటి నిరుద్యోగ యువత ఆవేదనను కళ్లకు కట్టింది. సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత, నేటి ఐటీ విప్లవంలోనూ మారని సగటు ఇంజనీరింగ్ యువత కష్టాలను ప్రతిబింబిస్తూ వచ్చిన తాజా వెబ్ సిరీస్ ‘ఆకలి రాజ్యం 2026’. ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టెక్ లేఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, సరైన ఉపాధి అవకాశాలు లేక దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీటెక్ పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమీర్‌పేట, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో చిన్న రూములు అద్దెకు తీసుకుని ఏళ్ల తరబడి ఉద్యోగ వేటలో అలసిపోతున్న యువత జీవితాలకు అద్దం పడుతూ.. టెలి ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజవేలు, పద్మిని నిర్మాణంలో దర్శకుడు నీలగిరి మామిళ్ళ ఈ సోషల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *