సింగర్ సునీత కొడుకు హీరోగా కొత్త మలుపు.. ఈ ట్రైలర్ చూశారా బాసూ ఎలా ఉందో..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సింగర్ సునీత కొడుకు హీరోగా రాబోతున్న మరో సినిమా కొత్త మలుపు. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

News18
News18

టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించిన శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని యశ్వంత్ నాగ్ అందించారు.

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ఆశీర్వదించిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.

నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, “మా సినిమా బాగుందని బ్లెస్సింగ్ అందించిన ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇది నాకు తొలి సినిమా. దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్‌కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. కమెడియన్ మహేంద్ర సినిమా లో చేసిన కామెడీ హైలెట్ గా నిలుస్తుందని అన్నారు..

హీరో ఆకాష్ గోపరాజు మాట్లాడుతూ, “ ముందుగా మా సినిమాను మా చిత్ర యూనిట్ ను అభినందించిన కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ భైరవి అర్ధ్యా మాట్లాడుతూ, “నా కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి” అని పేర్కొన్నారు. ‘కొత్త మలుపు’ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం అంటున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed