Thimmaraju Pally T.V Movie: నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసిన ‘తిమ్మరాజు పల్లి T.V’ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

గత నెలలో రిలీజైన తిమ్మరాజు పల్లి T.V సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. అయితే కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా థియేట్రికల్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది.

News18
News18

గత నెలలో రిలీజైన తిమ్మరాజు పల్లి T.V సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. అయితే కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా థియేట్రికల్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాను అవసరమైనంత తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేశాడు. దాంతో నిర్మాతగా సేఫ్ సైడ్ అయ్యాడు. థియేట్రికల్ పరంగా నష్టాలు వచ్చినా.. ఓటీటీ, శాటిలైట్ రూపంలో పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చేసింది. వి. మునిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. శుక్రవారం నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది.

టైటిల్‌కు తగ్గట్లుగానే ‘తిమ్మరాజు పల్లి TV’ అనే ఊరు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పండగ రోజు ఊరంతా కలిసి డబ్బులు పోగేసుకుని టీవీని రెంట్‌కు తెచ్చుకుని సినిమాలు చూస్తుంటారు ఆ పల్లె ప్రజలు. కాగా.. ఆ ఊరిలో రాజప్ప అనే వ్యక్తి ఫస్ట్ టీవీని తీసుకొస్తాడు. అదే ఊర్లో ఉండే ఓ పెద్ద మనిషికి తన కంటే ముందు టీవీ తీసుకువారడంతో తల తీసినంతపని అయితుంది. అయితే ఒక రోజు రాజప్ప ఇంట్లో టీవీని ఎవరో ఎత్తుకుపోతారు. ఆ నిందను సతీష్(హీరో)పై వేస్తారు. మరి నిజంగానే సతీష్ టీవీని దొంగలించాడా? లేదంటే ఈగోతో రగిలిపోతున్న ఊరి పెద్దమనిషి ఎత్తుకెళ్లాడా అనేది తెలియాంటే ఈ సినిమా చూడాలి.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ కాన్సెప్ట్‌తో సాగే ఈ సినిమా రియలిస్టక్ టచ్‌తో దర్శకుడు తెరకెక్కించాడు. సినిమా మొత్తం ఒక మిక్స్‌డ్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్‌గా సాగుతుంది. కొన్ని సీన్లు మెప్పించినప్పటికీ.. ఫుల్ సాటిస్‌ఫై అయితే చేయదు. అయితే.. సెకండాఫ్‌లో వచ్చే మిస్టరీ ఎలిమెంట్స్ మాత్రం కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా టీవీని ఎవరు దొంగలించారు అనే క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేశారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం.. ఊర్లో వాళ్ల జీవితం, చిన్న చిన్న కామెడీ సన్నివేశాలు, గొడవలు, లవ్ ట్రాక్ వంటి అంశాలతో కథ నడుస్తుంది. కానీ వీటిలో ఏ పాయింట్‌లో కూడా కొత్తదనం లేకపోవడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. స్లో నేరేషన్ కారణంగా చాలా సీన్లు లాగుతున్నట్టుగా అనిపిస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సినిమాపై కొంత వరకు పర్వాలేదు అనిపిస్తుంది. మళ్ల మధ్యలో కొంత బోరింగ్ ఫీల్ కలిగించిన ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఓకే అనేలా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో అసలు టీవీ ఎవరు దొంగలించారో చూపించి అందరికి షాక్ ఇచ్చారు. చివర్లో వచ్చే ఫీల్‌గుడ్ ఎలిమెంట్ సినిమా మీద కొంత పాజిటివ్ ఇంప్రెషన్ మిగులుస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports