Green Card: గ్రీన్‌కార్డు ఆశావహులకు అమెరికా షాక్.. దెబ్బకు హెచ్-1బీ అప్లికేషన్లు 38.5% డౌన్! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

అలాంటి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకొనే వారి విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యర్థికి సంబంధించిన అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ కొత్త పాలసీ మెమోలో మార్గదర్శకాలు జారీ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Green Card: అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్‌కార్డు సాధించాలని కలలు కనే విదేశీయులకు, ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై అక్కడ నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు మరియు విద్యార్థులకు భారీ షాక్ తగిలింది. అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై తమ దరఖాస్తులను సమర్పించడానికి తప్పనిసరిగా స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) స్పష్టం చేసింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ యూఎస్‌సీఐఎస్ సరికొత్త పాలసీ మెమోను అధికారికంగా ప్రకటించింది.

సొంత దేశం నుంచే దరఖాస్తు చేయాలి..

నూతన పాలసీ మార్గదర్శకాల ప్రకారం.. అమెరికాలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులకు గ్రీన్‌కార్డు కావాలంటే ఇకపై వారు తమ మాతృదేశానికి వెళ్లి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కప్లర్ మాట్లాడుతూ.. కొన్ని అత్యంత అసాధారణ మరియు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు. అసాధారణ పరిస్థితుల్లో అమెరికా నుంచే ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ (Adjustment of Status) కు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఇప్పటికీ అందుబాటులో ఉన్నప్పటికీ, దానిపై కఠిన నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకొనే వారి విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యర్థికి సంబంధించిన అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ కొత్త పాలసీ మెమోలో మార్గదర్శకాలు జారీ చేశారు.

వలస చట్టాల లొసుగులకు చెక్

అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశానికి అనుగుణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు జాక్ కప్లర్ వివరించారు. ఈ నూతన విధానం వల్ల అమెరికా వలస వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని శ్వేతసౌధం నమ్ముతోంది. చట్టంలోని లోపాలను, లొసుగులను ఉపయోగించుకుంటూ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు ఈ నిర్ణయంతో చాలావరకు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా గ్రీన్‌కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పటికీ, చాలామంది కొన్నేళ్ల పాటు అమెరికాలోనే అక్రమంగా నివాసం ఉంటున్నారని, కొత్త నిబంధనల వల్ల అలాంటి వారిని గుర్తించి, దేశం నుండి తొలగించే అవసరం కూడా ప్రభుత్వానికి తగ్గుతుందని కప్లర్ పేర్కొన్నారు.

టూరిస్టులు, విద్యార్థులపై కఠిన ఆంక్షలు

తాత్కాలిక వీసాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించి స్థిరపడాలనే ఆలోచన ఉన్నవారికి ఈ ప్రకటన గట్టి హెచ్చరికగా మారింది. “విద్యార్థులు (Students), తాత్కాలిక కార్మికులు (Temporary Workers), టూరిస్టు వీసా (Tourist Visa) మీద అమెరికాకు వచ్చినవారు తమ పర్యటన లేదా పని పూర్తికాగానే వెంటనే దేశాన్ని వీడి వెళ్లాలి. గ్రీన్‌కార్డు హోదా పొందడానికి వారి అమెరికా పర్యటన తొలి అడుగుగా మారకూడదన్నదే ఈ సరికొత్త విధానం యొక్క ముఖ్య లక్ష్యం” అని జాక్ కప్లర్ స్పష్టం చేశారు. దీనివల్ల చదువు ముగించుకుని గ్రీన్‌కార్డుల కోసం ప్రయత్నించే విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

హెచ్-1బీ దరఖాస్తులు 38.5 శాతం భారీ తగ్గుదల!

యూఎస్‌సీఐఎస్ తీసుకుంటున్న వరుస కఠిన చర్యల ప్రభావం అమెరికా వీసా దరఖాస్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త నిబంధనల అమలు మరియు కఠినమైన వలస విధానాల కారణంగా రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 38.5 శాతం మేర భారీగా తగ్గింది. గత 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 3,43,981 హెచ్-1బీ దరఖాస్తులు రాగా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి కేవలం 2,11,600 దరఖాస్తులకు మాత్రమే పడిపోయాయి. గ్రీన్‌కార్డులు మరియు వీసాల ఆమోదం విషయంలో ఇకపై ఉన్నత డిగ్రీలు (Higher Degrees) కలిగి ఉండి, అత్యధిక వేతనాలు (Higher Salaries) పొందుతున్న అంతర్జాతీయ అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పులు ఐటీ రంగంలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల గ్రీన్‌కార్డు కలలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports