యశ్వంత్‌పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు 06540 నంబర్‌తో మరో వన్‌వే ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 9న రాత్రి 10.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, అక్టోబర్ 12న తెల్లవారుజామున 4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, వాడి, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, దౌండ్, అహిల్యానగర్, కోపర్గావ్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, జబల్పూర్, కట్నీ, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బాందా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులోనూ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)














