Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్!



తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. “నేను చెప్పే విషయాల్లో ఒక్కటి అబద్ధమని తేలినా నన్ను ఉరి తీయండి.. ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. కానీ నేను చెప్పేవి నిజాలైతే ఆ సంస్థపై, ఆ మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రా (HYDRAA), మంత్రుల అక్రమ మైనింగ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. దీనికి సంబంధించిన ఆధారాలను, ఫోటోలను కూడా ఆయన సభ ముందుంచారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *