Tamil Nadu CM Vijay | సీఎం విజయ్ సెక్యూరిటీని చూసారా..! విజయ్ కి భారీగా భద్రత | ACTPnews

Tamil Nadu CM Vijay   | సీఎం విజయ్ సెక్యూరిటీని చూసారా..! విజయ్ కి భారీగా భద్రత



తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారిగా తిరుచిరాపల్లి, కరూర్ జిల్లాల్లో పర్యటిస్తుండటంతో పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కరూర్ వెళ్లే జాతీయ రహదారి పొడవునా ఐజీ, డీఐజీల పర్యవేక్షణలో ఏకంగా 6,000 మందికి పైగా పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. నటుడి నుండి సీఎం అయిన విజయ్ని చూడటానికి ఎయిర్పోర్ట్ వెలుపల వేలాది మంది అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం సీఎం విజయ్ కరూర్ వెళ్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports