Last Updated:
India vs Sri Lanka: భారత జట్టు ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడు.
అద్భుతమైన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో మ్యాచ్ ఫలితాలను మార్చేసే జడేజా.. తనకిష్టమైన ప్రత్యర్థి జట్టు అయిన శ్రీలంకపై మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన జడేజా.. గత ఏడాది దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించలేదు. లంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటంతో జడేజా పాత్ర మరింత కీలకం కానుంది.














