Ameer Log: హైదరాబాదీ దోస్తానా రుచి చూపించేలా అమీర్ లోగ్ మూవీ.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ చేశారు.

News18
News18

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణ రెడ్డి సోమ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను దక్కించుకోవడం ఈ ప్రాజెక్ట్‌‌పై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విశేష ఆదరణ లభించింది.

తాజాగా చిత్ర బృందం “సీదా హెలికాప్టర్ షాట్” అనే పాటను విడుదల చేసింది. ఇది ఒక ‘స్ట్రీట్ ఆంథమ్’ (యువతను ఉర్రూతలూగించే గీతం)లా అనిపిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాట ప్రధాన పాత్రల మధ్య స్నేహాన్ని, వారి బంధాన్ని చూపిస్తోంది. ఎంసి హరి రచించి, నటించిన ఈ “సీదా హెలికాప్టర్ షాట్” కుర్రాళ్లకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పాటలో స్నేహం విలువ, యువత ఆశయాలు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. విజయం సాధించాలనే తపన ఈ పాటలో కనిపిస్తుంది. “పోరాడటమే నా రక్తంలోని స్ఫూర్తి”, “యుద్ధం మొదలైనప్పుడు, ఎవరి మాట వినవద్దు” అనే లైన్స్ అలుపెరుగని దృఢ సంకల్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ పాటలో ఉపయోగించిన పదాలు, యాస చూస్తుంటే ఇదొక పక్కా లోకల్ ప్రొడక్ట్‌గా కనిపిస్తోంది.

లిరికల్ వీడియో సైతం ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ నేచురల్‌గా కనిపిస్తున్నాయి. ప్రధాన తారాగణం ఇందులో ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తోంది. హైదరబాద్ గల్లీలను కూడా అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. ఎస్‌వీకే సినిమాటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ అందించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports