Last Updated:
అరిజిత్ సింగ్ కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి అభిమానిని పరామర్శించారు. ఆయన మానవత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ గాయకుడు అరిజిత్ సింగ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చికిత్స పొందుతున్న తన చిన్నారి అభిమానిని పరామర్శించేందుకు ఆయన స్వయంగా కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా అభిమాని కోసం సమయం కేటాయించిన అరిజిత్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పశ్చిమ బెంగాల్ లోని జియాగంజ్ నుంచి కోల్‌కతాకు చేరుకున్న అరిజిత్ సింగ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. ఆయనను చూసిన ఆస్పత్రి సిబ్బంది, అక్కడున్నవారు తొలుత వ్యక్తిగత వైద్య పరీక్షల కోసమే వచ్చారని భావించారు. అయితే కొద్దిసేపటికే ఆయన అసలు ఉద్దేశం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన చిన్నారి అభిమానిని కలిసేందుకు అరిజిత్ సింగ్ నేరుగా వార్డులోకి వెళ్లారు. చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆ చిన్నారితో కలిసి ఫొటోలు కూడా దిగారు. తన అభిమాన గాయకుడు స్వయంగా వచ్చి పరామర్శించడంతో చిన్నారితో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అరిజిత్ సింగ్ ఈ ఆత్మీయ పరామర్శతో ఆస్పత్రిలోని ఇతర రోగులు, సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల పట్ల ఆయన చూపిన ఆప్యాయత, మానవత్వం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. స్టార్‌డమ్ కంటే అభిమానులపై ప్రేమే ముఖ్యమని మరోసారి అరిజిత్ సింగ్ తన చర్యతో నిరూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













