Last Updated:
తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అర్జున్‌పై ఆయన తండ్రి సచిన్ టెండూల్కర్, సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన ప్రశంసల జల్లు కురిపించారు.
Arjun Tendulkar: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు తరపున బరిలోకి దిగాడు. లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఏకనా స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఆయన ఈ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అర్జున్‌పై ఆయన తండ్రి సచిన్ టెండూల్కర్, సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన ప్రశంసల జల్లు కురిపించారు.
భారీ స్కోర్లు నమోదైన ఈ ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేస్తూ, ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఒక పదునైన యార్కర్‌తో హడలెత్తించాడు. చివరకు ఎల్బీగా అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
తన తమ్ముడు అర్జున్ సాధించిన ఈ విజయాన్ని చూసి సోదరి సారా టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అర్జున్ ఫోటోలను పంచుకుంటూ ఒక హృదయపూర్వక నోట్ రాశారు. “నువ్వు ఈ ప్రపంచంలోని అత్యుత్తమ విజయాలన్నింటికీ అర్హుడివి నా బుజ్జి తమ్ముడా. నీ కఠిన శ్రమ, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే నీ సామర్థ్యం, మరియు వీటన్నింటి మధ్య నువ్వు ప్రదర్శించిన ఓర్పును చూస్తుంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నిన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సీజన్ లీగ్ దశలో ఆడుతున్న చివరి మ్యాచ్ (Final League Game) వరకు అర్జున్ టెండూల్కర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. అయినప్పటికీ పట్టుదలతో ఎదురుచూసిన కొడుకు ఓర్పును తండ్రి సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా అభినందించారు.
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much… pic.twitter.com/3RdiGkXbfT
— Sachin Tendulkar (@sachin_rt) May 23, 2026
“వెల్ డన్ అర్జున్. ఈ సీజన్ పొడవునా నువ్వు నిన్ను మలుచుకున్న విధానం చూసి గర్విస్తున్నాను. ఎల్లప్పుడూ నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్మావు. ఈ సీజన్ చివరి మ్యాచ్ వరకు నీకు అవకాశం రాకపోయినప్పటికీ ఎంతో ఓపికగా ఉంటూ, నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకుంటూ, సానుకూల దృక్పథంతో నిలిచావు. క్రికెట్ అనేది ఆటగాడి నైపుణ్యాన్ని ఎంతగా పరీక్షిస్తుందో, అంతకంటే ఎక్కువగా అతడి ఓర్పును కూడా పరీక్షిస్తుంది. ఈ రోజు నువ్వు ఈ రెండింటినీ చాలా అందంగా హ్యాండిల్ చేశావు. నీ కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉండేలా (వినమ్రంగా) చూసుకో, ఈ ఆటను నువ్వు ఎప్పుడూ ప్రేమించినట్లే ఇకముందు కూడా ప్రేమిస్తూ ముందుకు సాగు” అని సచిన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 24, 2026 11:33 AM IST













