మూడో వారం ఎలిమినేషన్ కోసం త్రిగుణ్, సుధీర్ రెడ్డి, అమన్, చరణ్, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్ ఝాన్సీ నామినేషన్స్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ టాప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు వారాల్లో బాటమ్‌లో కనిపించిన సుధీర్ రెడ్డి ఈసారి పుంజుకుని టాప్ 2లోకి వచ్చాడు. అమన్, చరణ్, షాలిని కూడా టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వంశీ, వర్షిణి, ఝాన్సీ బాటమ్‌లో ఉన్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అధికారిక ఓటింగ్‌కు సంబంధించి కూడా వంశీ, వర్షిణి బాటమ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిద్దరిలో ఒకరు మూడో వారం ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. ముఖ్యంగా వంశీ ఎలిమినేషన్ దాదాపు ఖాయమైందనే ప్రచారం సాగింది.














