DC vs KKR: ఢిల్లీ చెత్త బ్యాటింగ్.. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

credit: x


Last Updated:

ఢిల్లీ DC 20 ఓవర్లలో 8 వికెట్లకు 142, నిస్సంక 50, కేఎల్ రాహుల్ 23, అశుతోష్ 39, కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో 2 వికెట్లు, నరైన్ తదితరులకు ఒక్కో వికెట్.

credit: x
credit: x

ఢిల్లీ వేదికగా కోల్‌కతా జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య DC బ్యాటర్లు చెత్త పెర్ఫామెన్స్ కనబర్చారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే సాధించారు. ఓపెనర్ నిస్సంక 50 (5 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ 23 (4 ఫోర్లు) మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (8), సమీర్ రిజ్వి (3), ట్రిస్టన్ స్టబ్స్ (2), అక్షర్ పటేల్ (11).. ఇలా కీలక ప్లేయర్లంతా చేతులెత్తేశారు. చివర్లో అశుతోష్ 39 (3 ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేయడంతో ఢిల్లీ 142 స్కోర్ చేయగలిగింది. ఇక కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్, వైభవ్ అరోరా, గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports