Debjani Bigg Boss Telugu 10: అక్కకు తెలుగే రాదు.. హౌస్‌లో ఏం చేస్తుందో ఏమో! పాపం దేబ్జానీ | | ACTPnews

Debjani Bigg Boss Telugu 10: అక్కకు తెలుగే రాదు.. హౌస్‌లో ఏం చేస్తుందో ఏమో! పాపం దేబ్జానీ |


దేబ్జానీ హౌస్‌లోకి అడుగుపెట్టగానే ఆమెకున్న అతిపెద్ద మైనస్ పాయింట్ స్పష్టంగా బయటపడింది. సీరియల్స్‌లో డబ్బింగ్ సాయంతో డైలాగులు చెప్పి మెప్పించినప్పటికీ, రియల్ లైఫ్‌లో ఆమెకు తెలుగు అంతగా రాకపోవడం వేదికపైనే స్పష్టమైంది. స్టేజ్ మీద హోస్ట్ నాగార్జునతో మాట్లాడేటప్పుడు ఆమె భావాలను సరిగ్గా వ్యక్తపరచలేక ఇబ్బంది పడగా, కింగ్ నాగార్జునే ప్రతి పాయింట్‌ను అర్థం చేసుకుని, సమన్వయం చేస్తూ ఆడియన్స్‌కు వివరించాల్సి వచ్చింది. బిగ్ బాస్ లాంటి మైండ్ గేమ్‌లో మాటల యుద్ధాలు, వాదోపవాదాలు, నామినేషన్ల సమయంలో పాయింట్లు లేవనెత్తడం అత్యంత కీలకం. అలాంటి చోట స్వచ్ఛమైన తెలుగు తెలిసిన తోటి కంటెస్టెంట్ల మధ్య దేబ్జానీ కేవలం తన కొద్దిపాటి తెలుగు, ఇంగ్లీష్‌తో ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలదు? హౌస్‌లో గొడవలు, టాస్కులు ఎదురైనప్పుడు తన వాదనను బలంగా వినిపించి ఎలా సర్వైవ్ అవుతుంది? అనేది ఇప్పుడు ఆడియన్స్‌తో పాటు నిర్వాహకుల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed