Dharani I Love You: కల్ట్ ప్రొడ్యూసర్ SKN చేతుల మీదుగా ‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ లాంచ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత, కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా ఆవిష్కరించారు. చిత్ర బృందం సమక్షంలో జరిగిన ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం సందడిగా జరిగింది.

News18
News18

‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత, కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా ఆవిష్కరించారు. చిత్ర బృందం సమక్షంలో జరిగిన ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా SKN మాట్లాడుతూ.. ‘ధరణి ఐ లవ్ యు’ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉందని, టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ కలుగుతోందని అన్నారు. ధరణి i love you డైరెక్టర్ సాయికృష్ణ కె.వి కి ఇది సెకండ్ మూవీ.. తను రాజమౌళి గారి దగ్గర మగధీర మూవీకి అసోసియేట్ గా వర్క్ చేసారు. నిర్మాత రాజశేఖర్ గారికి,చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

డైరెక్టర్ సాయికృష్ణ కె.వి మాట్లాడుతూ ‘కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీద మా ధరణి i love you ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇండస్ట్రీలో టైమింగ్ ఉన్న ప్రొడ్యూసర్. బేబీ, చెన్నై లవ్ స్టోరీ.. ఇలా వరుస విజయలతో బిజీ ఉండి ధరణి i love you పోస్టర్ లాంచ్ చేసినందుకు చాలా థాంక్స్.. ఆయన స్టేజ్ మీద ఒక రైమింగ్ తో టైమింగ్ లో ఇచ్చే స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.. అందులో నేను ఒకడిని అన్నారు.

నిర్మాత, హీరో, హీరోయిన్స్ చిత్ర బృందం మాట్లాడుతూ.. తమ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను SKN చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయికృష్ణ కె.వి, నిర్మాత రాజశేఖర్ మద్దికుంట, హీరో వంశీ, హీరోయిన్ మహిత, రైటర్ బాలసూర్య చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీమతి బాలామణి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం – సాయికృష్ణ.కె.వి. అలాగే నిర్మాత- రాజశేఖర్ మద్దికుంట, మ్యూజిక్- పద్మనాబ్ భరద్వాజ్, ఎడిటింగ్ – నందమూరి హరి,ఎన్.టి.ఆర్, సినిమాటోగ్రఫీ- చిన్నయోగి అన్నెం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed