Harish Rao Fire on Congress government: సింగరేణిని నాశనం చేస్తున్నారు! | ACTPnews

Harish Rao Fire on Congress government: సింగరేణిని నాశనం చేస్తున్నారు!



సింగరేణి బొగ్గు గని ప్రాంత సమస్యలు, కార్మికుల సంక్షేమంపై మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ‘సింగరేణి కార్మిక గర్జన’ అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ ఆర్జించే లాభాల్లో కార్మికులకు చెల్లించాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని, అర్హులైన కార్మిక కుటుంబ సభ్యులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటు ఎంతమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, అలాగే ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు.#HarishRao #SingareniKarmikaGarjana #Ramagundam



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports