Heart Touching Story: ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే కలియుగం అంతమవడం లేదు.. పెద్దాయన సాయం వెలకట్టలేనిది | ట్రెండింగ్ | ACTPnews

Real Indian Hero


Last Updated:

Humanity Story: 70 ఏళ్ల వృద్ధుడు వయసుపైబడినప్పటికి ఎండలో దాహంతో ఆరిపోయే గొంతులను తడపాలని శక్తినంతా కూడగట్టుకొని మండుటెండల్లో నిస్వార్ధ సేవ చేస్తున్నాడు. ఇది అతను నిన్న, మొన్న మొదలుపెట్టిన సేవ కార్యక్రమం కాదు. ఎవరో చూస్తారు.. ఏదో గుర్తింపు వస్తుందని ఆశించి చేస్తున్న ఉపకారం అంతకంటే కాదు. రెండు దశాబ్దాలు అంటే 20 ఏళ్లుగా వేసవికాలం వస్తే చాలు బాటసారులకు దాహార్తిని తీరుస్తున్నాడు.

Real Indian Hero
Real Indian Hero

Humanity Story: ప్రస్తుత సమాజంలో సాటి మనిషికి సాయం చేసే అలవాటు లేకుండా పోయింది. మంచి చేయాలనే ఆలోచన కూడా రావడం లేదు. పెరిగిపోతున్న స్వార్ధం, ఎవరికైనా ఏదైనా మాట సహాయం చేయాలన్న మనకేంటి లాభం అనే ప్రశ్న ముందు మనసులో పుడుతుంది. ఇలాంటి కంప్యూటర్ యుగంలో కూడా 70 ఏళ్ల వృద్ధుడు వయసుపైబడినప్పటికి ఎండలో దాహంతో ఆరిపోయే గొంతులను తడపాలని శక్తినంతా కూడగట్టుకొని మండుటెండల్లో నిస్వార్ధ సేవ చేస్తున్నాడు. ఇది అతను నిన్న, మొన్న మొదలుపెట్టిన సేవ కార్యక్రమం కాదు. ఎవరో చూస్తారు.. ఏదో గుర్తింపు వస్తుందని ఆశించి చేస్తున్న ఉపకారం అంతకంటే కాదు. రెండు దశాబ్దాలు అంటే 20 ఏళ్లుగా వేసవికాలం వస్తే చాలు బాటిల్స్‌లో నీళ్లు నింపుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి, బస్టాండ్‌లో దప్పికతో ఉన్న వారికి నీరు అందిస్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అతని వీడియోలు ఒక్కసారిగా వైరల్ కావడంతో అతడ్ని రియల్ ఇండియన్ అంటూ పొగిడేస్తున్నారు. రాజస్థాన్‌కి చెందిన 71 ఏళ్ల థానారామ్ అనే వృద్దుడు అందరికి ఆత్మీయుడిగా మారిపోయాడు.

దాహార్చిని తీరుస్తున్న బాటసారి..

ఓవైపు మాడు పగిలిపోయే ఎండల్లో రోడ్లపై దూర ప్రయాణాలు చేసే వారికి 71 ఏళ్ల థానా రామ్ ఒక ఆత్మీయుడిలా కనిపిస్తారు. రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన వృద్దుడు గత 21 ఏళ్లుగా ఒక మంచి లక్ష్యంతో ప్రతిరోజూ రోడ్డుపైకి వస్తున్నారు. ఏ ఒక్కరూ దాహంతో ఇబ్బంది పడకూడదని బాటసారులకు బాసటగా నిలిస్తున్నాడు. థానా రామ్ చేసే సేవ ఏమిటంటే చేతిలో మంచి నీళ్లతో రోడ్డు పక్కన నిలబడి వాహనాల్లో, నడుచుకుంటూ వెళ్లే వారికి దాహం అయితే బాటిల్స్ లేదంటే గ్లాసులో మంచినీళ్లు ఇస్తుంటాడు.

21 సంవత్సరాలుగా ఇదే సేవ..

ఇది ఒకటి రెండు సంవత్సరాల నుండి చేస్తున్న ఉపకారం కాదు. సుమారు 21 సంవత్సరాలుగా ఆయన సొంత ఊరిలోని ప్రధాన రహదారిపై నిలబడి పంచె, ఫుల్ కాటన్ బన్నీన్ వేసుకొని రోడ్డుపై అటుగా వెళ్లే ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్లు, కార్మికులకు తాగునీరు అందిస్తూ ఉచితంగా వాళ్ల దాహార్తిని తీరుస్తున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, కేవలం పెద్ద మనసుతో ఈ పెద్దాయన చేస్తున్న సేవ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అందరికి తెలిసింది.

మహాసేవకుడు..

ఈ పెద్దాయన చేస్తున్న సేవను చూసిన మోహన్ బలియారా అనే వ్యక్తి ఈ అద్భుతమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో థానా రామ్ చేస్తున్న ఈ నిశ్శబ్ద సేవ వెలుగులోకి వచ్చింది. ఆయన నిస్వార్థ సేవ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. వయసు పైబడినప్పటికీ, మానవత్వంతో ఆయన చేస్తున్న ఈ చిన్న సహాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అది ముమ్మాటికి నిజమేనని థానా రామ్ కథ చూస్తే అర్థమవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports