Hyderabad ACB Raids: ఏసీబీ వలలో చిక్కిన భారీ తిమింగలం.. సస్పెండ్ డీఎస్పీ బినామీ ఇంట్లో కోటి 35 లక్షల క్యాష్ సీజ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad ACB Raids


Last Updated:

yderabad: తెలంగాణలో అవినీతికి సొమ్ముకు అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన ప్రభుత్వ ఉద్యోగాలను పట్టుకోవడం కోసం అవినీతి నిరోధకశాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం నిమ్స్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీ భాస్కర్‌ వంద కోట్ల అక్రమాస్తులు గుర్తించిన తర్వాత ఇప్పుడు సస్పెండైన డీఎస్పీ భీమ్ రెడ్డి బినామి ఇంట్లో కోటీకిపైగా క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad ACB Raids
Hyderabad ACB Raids

Hyderabad: తెలంగాణలో అవినీతికి సొమ్ముకు అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన ప్రభుత్వ ఉద్యోగాలను పట్టుకోవడం కోసం అవినీతి నిరోధకశాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం నిమ్స్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీ భాస్కర్‌ వంద కోట్ల అక్రమాస్తులు గుర్తించిన తర్వాత ఇప్పుడు సస్పెండైన డీఎస్పీ భీమ్ రెడ్డి బినామి ఇంట్లో కోటీకిపైగా క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో కోటి 35 లక్షల క్యాష్ తో పట్టుబడిన బొమ్మా వెంకటేష్ అనే వ్యక్తి డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 8 మంది బినామీల ఇళ్లలో 10 చోట్ల గురువారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వహించి అక్రమాస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలు, క్యాష్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏసీబీ దాడులు వైట్ కాలర్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

సస్పెండ్ డీఎస్పీ బినామీనే కోటీశ్వరుడా..

తెలంగాణ పోలీస్ శాఖ కంప్యూటర్స్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పని చేస్తూ సస్పెండ్ అయిన సంకిరెడ్డి భీమ్ రెడ్డి అవినీతి ఆస్తుల చిట్టా తవ్వే కొద్ది బయటపడుతోంది. తాజాగా గురువారం ఏసీబీ అధికారులు బొమ్మా వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి కోటి 35 లక్షల క్యాష్ సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు, ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడిన వ్యక్తి సస్పెండ్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డి బినామీగా గుర్తించారు. ఎందుకంటే ఆయన ఇంట్లో తగిన పత్రాలు, ఆధారాలను పరిశీలించిన అధికారులు బినామీగా గుర్తించారు. అతనితో పాటు మరో ఏడుగురు బినామీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ల దగ్గర కూడా కోట్ల రూపాయలు ఆస్తులు ఉండవచ్చని భావిస్తున్నారు.

బయటపడ్డ నోట్ల కట్టలు..

సస్పెండైన డీఎస్పీ భీమ్ రెడ్డికి సంబంధించిన ఒక బినామీ ఇంట్లోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో ఇప్పుడు ఆయన ఆత్మీయులు, అనుచరులు, కుటుంబ సభ్యులపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. భీంరెడ్డి జులై 2న ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ రైడ్ చేసింది. అతనితో పాటు బంధువులు, కింది స్థాయి ఉద్యోగుల ఇళ్లలో సోదాలు నిర్వహించి రూ.9.5 కోట్ల ఆస్తిని గుర్తించింది.మార్కెట్ లెక్కల ప్రకారం వీటి విలువ సుమారు రూ.200 కోట్ల రూపాయలు ఉంటుందని అప్పుడే తెలిపారు. ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన భీంరెడ్డి తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు.

వందల కోట్ల అక్రమాస్తులు..

దీంతో ఏసీబీ అధికారులు మరోసారి ఆయన బినామీలుగా భావిస్తున్న వారిపై నిఘా పెట్టి రైడ్ చేశారు. గురువారం హైదరాబాద్, జహిరాబాద్ ప్రాంతాల్లోని 10 చోట్ల మెరుపు దాడులు నిర్వహించారు. మణికొండలోని బొమ్మా వెంకటేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులకు రూ.కోటి 35 లక్షల విలువైన క్యాష్ ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఫారిన్ కరెన్సీ, విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed