మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే పాకిస్తాన్‌పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తలపడగా, భారత్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తొలి మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో సానుకూల వాతావరణం నెలకొంది. స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రిచా ఘోష్ 68 పరుగులతో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచింది. అటు ఫాతిమా సనా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు కూడా పూర్తి బలంతో బరిలోకి దిగుతోంది.
మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?: ఆదివారం, జూన్ 14, 2026.
మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభమవుతుంది?: భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు (7:00 PM IST) టాస్ పడుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
వేదిక ఎక్కడ?: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్).
టీవీలో లైవ్ ఎక్కడ చూడాలి?: భారతదేశంలో ఈ మ్యాచ్‌ను ‘స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్’ (Star Sports Network) ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
మొబైల్/ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ?: డిజిటల్ వీక్షకులు ఈ మ్యాచ్‌ను ‘జియోహాట్‌స్టార్’ (JioHotstar) యాప్ మరియు వెబ్సైట్ ద్వారా లైవ్‌లో వీక్షించవచ్చు.
తుది జట్ల (అంచనా)
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, భారతి ఫుల్మాలి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ.
మునీబా అలీ (వికెట్ కీపర్), గుల్ ఫెరోజా, అలియా రియాజ్, అయేషా జాఫర్, ఫాతిమా సనా (కెప్టెన్), ఇరామ్ జావేద్, నటాలియా పర్వైజ్, తూబా హసన్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.












