Last Updated:
India Australia Uranium Deal: కాలం మారింది. ఈ పదిహేనేళ్లలో భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అణు వ్యాపారంలో భారత్‌కు ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG) భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. భారత్ ఎన్.పి.టిపై సంతకం చేయకపోయినా, అదొక అత్యంత బాధ్యతాయుతమైన దేశమని ప్రపంచం మొత్తం అంగీకరించింది. తన అణు పరిజ్ఞానాన్ని భారత్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదనీ, ఇతర దేశాలకు బదిలీ చేయలేదని రుజువైంది.













