INDIA Bloc Anti CEC Protest: నిరసనలకు భయపడి కేంద్రం ఢిల్లీని జైలుగా మార్చింది.. కేంద్రాన్ని వదిలిపెట్టమన్న రాహుల్ గాంధీ | | ACTPnews

NDIA Bloc Anti CEC Protest


Last Updated:

INDIA Bloc Anti CEC Protest: ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్తున్న నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అంతటా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఆంక్షలు విధించడంపై స్పందించారు. నిరసనల పట్ల భయంతో ప్రభుత్వం మొత్తం రాజధానిని ఒక జైలుగా మార్చిందన్నారు.

NDIA Bloc Anti CEC Protest
NDIA Bloc Anti CEC Protest

INDIA Block Anti CEC Protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబట్టిన ఇండియా కూటమి అదే నినాదాన్ని సుప్రీం కోర్టు వరకు వినిపించాలని తలపెట్టిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై సూటి ప్రశ్నలు సంధిస్తూ, “ఓట్ల చోరీ”కి వ్యతిరేకంగా జరిగే నిరసనల పట్ల భయపడిన ప్రభుత్వం, ఢిల్లీ నగరాన్ని ఒక సైనిక స్థావరంలా , జైలులా మార్చివేసిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అపాయింట్‌మెంట్ అనుమతి కోరినా ఇవ్వకపోవడాన్ని ఈ ర్యాలీ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సీజేఐని ఎవరు నిర్దేశిస్తున్నారని అడిగారు.

3గంటలకు పిటిషన్ ఇస్తాం..

జ్ఞానేష్ కుమార్‌కు కల్పిస్తున్న కట్టుదిట్టమైన భద్రత, వాస్తవానికి ప్రతిపక్షాలు ఆయన అసలైన ‘నియంత్రణదారు’ను చేరుకోవడాన్ని సులభతరం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీజేఐ సూర్యకాంత్ ఆదేశాన్ని ఉటంకిస్తూ, భారత ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల నిష్పక్షపాతాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుప్రీంకోర్టులో అధికారిక పిటిషన్ దాఖలు చేయడానికి ఏకమవుతారని రాహుల్ పేర్కొన్నారు.

సీజేఐని నియంత్రిస్తారా..

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్య కాంత్‌తో సమావేశం జరగకపోవడంతో వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టాలన్న ప్రతిపక్ష పార్టీల వ్యూహానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం పరిశీలనలో (sub judice) ఉన్నందున పరిపాలనాపరమైన మార్గంలో వినతిపత్రం సమర్పించడానికి బదులుగా… న్యాయపరమైన ప్రక్రియ ద్వారా అధికారిక పిటిషన్‌ను దాఖలు చేసి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ప్రతిపక్ష నాయకులకు CJI స్పష్టమైన సందేశాన్ని అందించారు.

హాట్ హాట‌్‌గా మారిన ఢిల్లీ..

అయితే ఇదే అంశంపై ఇటు ఇండియా కూటమి సుప్రీం కోర్టు వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపడితే.. అటు సీజేపీ కూడా అల్టిమేటం జారీ చేసింది. జ్ఞానేష్ కుమార్ విషయంలో రాజీనామాకు 24 గంటలు టైమిచ్చింది. అటుపై తాము జంతర్ మంతర్ దగ్గర చేపట్టబోయే తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించాలంటూ పోలీసులకే ఆ బాధ్యతను అప్పగించింది. ఇక పోలీసుల నిర్ణయం కోసం 24 గంటలు ఎదురుచూస్తామని సీజేపీ నేతలు డెడ్ లైన్ విధించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports