IPL CSK vs GT 2026: చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్.. చెపాక్‌లో యుద్ధం.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవం! | క్రీడా వార్తలు | ACTPnews

చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (Image credit - x - @ChennaiIPL, @gujarat_titans)


Last Updated:

IPL CSK vs GT 2026: ఐపీఎల్‌లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్లేఆఫ్ మ్యాచ్‌‌కి కీలకమైన మ్యాచ్‌లు కావడంతో.. ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో చూస్తున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్ ఎనాలసిస్ చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (Image credit - x - @ChennaiIPL, @gujarat_titans)
చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (Image credit – x – @ChennaiIPL, @gujarat_titans)

చెన్నై: ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగబోతోంది. చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్.. రెండు జట్ల ప్లేఆఫ్ ఆశలకు కీలకమైనది. ప్రస్తుతం రెండు జట్లు కూడా 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ఓటములతో 6 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో 5వ, 7వ స్థానాల్లో ఉన్నాయి.

సీఎస్‌కే ఇటీవల ముంబై ఇండియన్స్‌పై 103 రనుల తేడాతో భారీ విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చింది. అయితే గుజరాత్ టైటాన్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఓడి బ్యాక్ టు బ్యాక్ ఓటములు చూసింది. చెపాక్ పిచ్.. స్పిన్‌లకు అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు తీవ్రమైన వేడి, తేమ కూడా ఉంటుంది. అందువల్ల ఈ మ్యాచ్ థ్రిల్లింగ్‌గా మారనుంది. ఎండ ప్లేయర్లకు పెద్ద పరీక్ష పెట్టనుందని ESPN క్రిక్ ఇన్ఫో రిపోర్ట్ చేసింది.

రెండు జట్ల పరిస్థితి ఏమిటి?

– చెన్నై సూపర్ కింగ్స్: నెట్ రన్ రేట్ +0.118తో మిడ్ టేబుల్‌లో ఉంది. ఇటీవలి ఫామ్ WLWWL. హోంగ్రౌండ్‌లో బలమైన రికార్డు ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ మెరుగుపడాల్సి ఉంది. బౌలింగ్‌లో డెత్ ఓవర్లు కీలకమైనవి.

– గుజరాత్ టైటాన్స్: నెట్ రన్ రేట్ -0.790తో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటీవలి ఫామ్ LLWWW. సాయి సుదర్శన్ సెంచరీలు సాధిస్తున్నా మిడిల్ ఆర్డర్ సమస్యలు కనిపిస్తున్నాయి. బౌలర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారు.

రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు సమానం (4-4)గా ఉంది. చెపాక్‌లో సీఎస్‌కే‌కి హోంగ్రౌండ్ ఫీల్ పాజిటివ్ వైబ్స్ ఇస్తుందనే అంచనా ఉంది.

స్టేడియం & వాతావరణం:

చెపాక్ స్టేడియం స్పిన్ బౌలర్లకు స్వర్గం. డ్రై పిచ్‌పై స్పిన్ తిరగడం ఖాయం. ఏప్రిల్ 26న చెన్నైలో తీవ్ర వేడి అంటే ఉష్ణోగ్రత 35 నుంచి 38 డిగ్రీలు నమోదవుతుందని యాక్యూవెదర్ తెలిపింది. వర్షం అవకాశం లేదు. కానీ హ్యూమిడిటీ (తేమ) ఆటగాళ్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది. ఆట ఆడేటప్పుడు చిరాకు వచ్చేస్తుంది. ఉక్కపోత, చెమట బాగా ఇబ్బంది పెట్టగలవు. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో డే-నైట్ పరిస్థితులు ఉంటాయి.
తెలంగాణ, ఏపీ క్రికెట్ ప్రేమికులకు స్పెషల్

హైదరాబాద్, విజయవాడ, విశాఖలోని క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పాయింట్ల పట్టికలో ముందుండడంతో తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ మధ్య ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్ రేసును మార్చేస్తుంది.
కీలకమైన పాయింట్లు:

– సీఎస్‌కే గత మ్యాచ్‌లో ముంబైపై భారీ విజయం సాధించి మోరల్ బూస్ట్ పొందింది.

– జీటీ మిడిల్ ఆర్డర్ ఇబ్బందులు, టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాలి.

– చెపాక్‌లో స్పిన్ బౌలర్లైన జడేజా, అశ్విన్ లాంటి వారు డామినేట్ చేసే అవకాశం.

– టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం లాభదాయకం కావచ్చు.

బీసీసీఐ అధికారికంగా షెడ్యూల్ మార్పులు చేసి ఈ మ్యాచ్‌ను చెన్నైకి మార్చింది. అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మ్యాచ్ ఫలితం ఆధారంగా రెండు జట్లూ.. ప్లేఆఫ్ రేసులో ఎలా ముందుకు సాగుతాయో చూడాలి. సీఎస్‌కే ఇంటి ఆధిక్యం ఉపయోగించుకుని విజయం సాధిస్తుందా? లేదా జీటీ బౌన్స్ బ్యాక్ చేస్తుందా? ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports