KTR | తెలంగాణలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోంది -కేటీఆర్ | ACTPnews

KTR  | తెలంగాణలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోంది -కేటీఆర్



తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుతం ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా దోపిడీలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన కేటీఆర్.. ప్రలోభాలకు లొంగకుండా నిలబడినందుకు వారిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని విమర్శించారు. ముఖ్యంగా ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ పేరుతో సింగరేణి ఆస్తులను లూటీ చేస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *