ఈ సందర్భంగా నటుడు ఆనంద చక్రపాణి మాట్లాడుతూ.. ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటి కథతో సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. మనం చాలా సమస్యల్ని మనకెందుకు అని చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటాం. ప్రశ్నించాలని అనుకోం. కానీ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా సొసైటీలో ఉన్న ఈ రుగ్మత గురించి ఆలోచింపజేసేలా సినిమా రూపొందించారు. ఈ సినిమా చూస్తుంటే చాలా సన్నివేశాల్లో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు మరింతగా ఆదరించాలి అన్నారు.
గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. మా సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ చూడటం సంతోషంగా ఉంది. సునీల్ కుమార్ రెడ్డిగారు ఒక మంచి విషయాన్ని ప్రేక్షకులకు, సొసైటీకి చెప్పాలని అనుకున్న ఉద్దేశం నెరవేరిందని అనిపిస్తోంది. కాలేజ్ స్టూడెంట్స్, టీచర్స్, పలు ఆర్గనైజేషన్స్ వాళ్లు మా మూవీ చూస్తున్నారు. సినిమా చూశాక వారిలో మా లాంటి వాళ్ల పట్ల ఒక కొత్త పర్సెప్షన్ కనిపిస్తోంది. ఇలాంటి మార్పు రావాలనే సునీల్ కుమార్ రెడ్డిగారు “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” సినిమా రూపొందించారు అన్నారు.
తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ.. “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. నేను ఈ సినిమాలో భాగమవడం సంతోషంగా ఉంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన సునీల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మా సమస్యల్ని చెప్పే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. అప్పుడే సమాజంలో మరికొంత మార్పు అనేది మొదలవుతుంది. ఈ సినిమా చూడని వారు తప్పకుండా చూడండి” అన్నారు.
నటుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో సినిమాల ఈవెంట్స్ చూసేందుకు ఇక్కడికి వచ్చినవాడిని. ఇప్పుడు మా సినిమా ఈవెంట్ లో నేను ఈ వేదిక మీద నిల్చుని మాట్లాడటం గర్వంగా ఉంది. మీ సినిమాను ప్రేక్షకులు చూస్తారా అని రిలీజ్ కు ముందు కొందరు అన్నారు. కానీ మంచి ప్రయత్నం చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తామని ఆడియెన్స్ మరోసారి ప్రూవ్ చేశారు అన్నారు.
నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో సునీల్ కుమార్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు. గే, ట్రాన్స్ జెండర్ సమస్యలు చెబుతూ వచ్చిన ఫస్ట్ సినిమా ఇదే. ఆ తర్వాత ఎన్ని చిత్రాలు వచ్చినా దీని తర్వాతే. శంకరాభరణం సినిమా ఒక చరిత్ర సృష్టించింది. ఈ అర్థనారీశ్వర సినిమా మరో చరిత్ర సృష్టించబోతోంది. ఈ సినిమాను సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్సుల్లో చూశాను. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేందుకు వస్తున్నారు. వీళ్ల ఆర్గనైజేషన్స్, మీడియా, సివిల్ సొసైటీలు, అన్నీ కలిసి “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” చిత్రానికి పెద్ద విజయం చేకూర్చాయి. ఇందుకు సునీల్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. నా కెరీర్ లో అమ్మో ఒకటో తారీఖు ఎలా గుర్తుండిపోతుందో ఈ “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది అన్నారు.
ట్రాన్స్ జెంటర్ ఇన్ స్టాగ్రామ్ యాక్టివిస్ట్ హీరోయిన్ హిమ రాథోడ్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా మా “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించలేదు. నేను సునీల్ కుమార్ రెడ్డిగారు ఇచ్చిన అవకాశంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాను. మేము మా జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను నా పాత్ర ద్వారా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు చూపించారు. ఈ సినిమాను మరింతగా సక్సెస్ చేయాలని కోరుతున్నా అన్నారు.
డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. ఎన్నో ఆర్గనైజేషన్స్, మీడియా మిత్రులు, ఛారిటీ సంస్థలు మా మూవీని ప్రశంసిస్తున్నాయి. ఈ సినిమా రూపొందించడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ట్రాన్స్ జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకు ఈ “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్” సినిమాను రూపొందించాను. సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. మా మూవీని మరింతగా ఆదరించాలి, ఈ సినిమాతో సొసైటీలో ఒక మంచి మార్పునకు అడుగుపడాలని కోరుకుంటున్నా. అన్నారు.
ముకుంద మాల ( క్వీర్ బందు పేరెంట్స్ అసోసియేషన్ ), గీత ( కీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్), సౌమ్య , స్వాతి ( అన్నపూర్ణ భాస్కరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ), సువర్ణ , అవిత ( అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ లీడర్స్ ), సందీప్ జైన్ ( మీడియా ), శాంతిప్రియ ( విస్టా ఇంటర్నేషనల్ స్కూల్ ),రామలింగ రెడ్డి ( రోటరీ హైదరాబాద్ మెగా సిటీ ), జయచంద్ర రెడ్డి ( ఎడ్యుకేషనలిస్ట్) పాల్గొని చిత్రవిజయాన్ని ఆకాంక్షించారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రశంసించారు.












