Lenin OTT: అఖిల్ లెనిన్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ పై కీలక సమాచారం బయటకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం..

News18
News18

అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచి అఖిల్ రగ్గడ్ లుక్, టీజర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అఖిల్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో ఈ వీకెండ్‌లో థియేటర్స్ కళకళలాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో లెనిన్ ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన కీలక సమాచారం బయటకొచ్చింది. ఈ రూరల్ మాస్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రన్ పరిస్థితిని బట్టి మరో వారం ముందైనా స్ట్రీమింగ్ కి తీసుకురావాలని అనుకుంటున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో.. అఖిల్ జంటగా భాగ్యశ్రీ నటించగా.. శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు.

లెనిన్ కథ ఏంటంటే.. రాయలసీమలోని రామాపురం అనే ప్రశాంతమైన గ్రామం. పగలు, ప్రతీకారాలు ఎరగని ఆ ఊరిలోకి పదేళ్ల అనాథ పిల్లాడు ‘లెనిన్’ అడుగుపెడతాడు. ఆ ఊరి పెద్దావిడ (ఈశ్వరీరావు) అతడిని అక్కున చేర్చుకుంటుంది. ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు ప్రాణస్నేహం ఏర్పడుతుంది. అయితే, ఊహించని పరిణామాల మధ్య జైలుకు వెళ్లిన లెనిన్, కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాక తన ప్రాణ స్నేహితుడు వసంత్‌తో సహా ఊరిలోని వంద మందిని దారుణంగా నరికి చంపుతాడు. అసలు రక్తం రుచే తెలియని ఆ నేలపై లెనిన్ ఎందుకు రక్తపాతం సృష్టించాడు? స్నేహానికి ప్రాణమిచ్చే వాడు నమ్మకద్రోహానికి ఎలా బలయ్యాడు? అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *