Last Updated:
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయం బయటకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచరస్ మూవీపై హాలీవుడ్ స్థాయిలో అంచనాలున్నాయి.














