OpenAI: హైదరాబాద్ టెకీకి జాక్‌పాట్.. ఓపెన్ఏఐలో కీలక బాధ్యతలు | | ACTPnews

ఉదయ్ రుద్దరాజు


Last Updated:

OpenAI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ‘ఓపెన్ఏఐ’ (OpenAI)లో కీలక పదవిని భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్ నిపుణుడు ఉదయ్ రుద్దరాజు దక్కించుకున్నారు.

ఉదయ్ రుద్దరాజు
ఉదయ్ రుద్దరాజు

కంపెనీలో ఒక సంవత్సరం పాటు ‘హెడ్ ఆఫ్ కంప్యూట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం, ఆయనను ‘సీటీఓ ఆఫ్ కంప్యూట్’ (CTO of Compute)గా ప్రమోట్ చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఉదయ్ లింక్డ్‌ఇన్‌లో స్పందిస్తూ.. “ఓపెన్ఏఐలో గడిపిన మొదటి 12 నెలలు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. GPT-5.6 వంటి అత్యాధునిక ఫ్రంటియర్ మోడళ్లను ట్రైన్ చేయడానికి అవసరమైన కంప్యూట్, నెట్‌వర్క్, స్టోరేజ్, మెషిన్ లెర్నింగ్ (ML) సిస్టమ్స్‌ను మా టీమ్ ఎంతో వేగంగా, విశ్వసనీయంగా అభివృద్ధి చేసింది. టెక్నాలజీ ప్రపంచంలో సరిహద్దులను బద్దలు కొడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

హైదరాబాద్ విద్యార్థి ప్రస్థానం.. ఐఐటీ ట్యాగ్ లేకుండానే చరిత్ర

ఉదయ్ రుద్దరాజు కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలో చాలామంది అమెరికాలో టాప్ పొజిషన్లకు వెళ్లాలంటే ఐఐటీ (IIT) లేదా ఎన్‌ఐటీ (NIT) బ్యాక్‌గ్రౌండ్ ఉండాలని భావిస్తారు. కానీ, ఉదయ్ హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) నుండి కంప్యూటర్ సైన్స్‌లో బీఈ (బ్యాచలర్స్) పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) లో ఇంటర్న్‌షిప్ సాధించిన ఆయన, ఆపై ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ట్విన్ సిటీస్ నుండి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత ఇబే (eBay), రాబిన్‌హుడ్ (Robinhood) వంటి దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ఇలాన్ మస్క్ కంపెనీ నుండి ఓపెన్ఏఐ వైపు

ఓపెన్ఏఐలోకి రాకముందు ఉదయ్.. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్ఏఐ’ (xAI) లో ‘హెడ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్’గా పనిచేశారు. మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన, 2.5 లక్షలకు పైగా జీపీయూలతో కూడిన ‘కొలోసస్’ (Colossus) సూపర్ కంప్యూటర్ నిర్మాణంలో మరియు ‘గ్రోక్ 3’ (Grok 3) ఏఐ మోడల్‌ను విజయవంతంగా ట్రైన్ చేయడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది జులై 2025లో ఆయన ఎక్స్ఏఐను వీడి ఓపెన్ఏఐలో చేరడం అప్పట్లో టెక్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.

ఎక్స్ఏఐకు గుడ్ బై చెప్పే సమయంలో ఇలాన్ మస్క్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. “ఇలాన్ మస్క్ నేరుగా రిపోర్ట్ చేస్తూ, ఆయన నుండి విషయాలు నేర్చుకోవడం నా కెరీర్‌లోనే అత్యుత్తమ భాగం. కొలోసస్ నిర్మాణంలో భాగమవ్వడం నా అదృష్టం” అని ఉదయ్ రుద్దరాజు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఓపెన్ఏఐ తన గ్లోబల్ ఏఐ సామర్థ్యాలను, డాటా సెంటర్లను భారీగా విస్తరిస్తున్న తరుణంలో, ఆ కంప్యూటింగ్ పగ్గాలను ఒక తెలుగు విద్యార్థి అందుకోవడం దేశానికే గర్వకారణం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed