అయితే అసలు ‘రామాయణ’ చిత్రంలో మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. లంక రాణిగా, రావణుడి భార్యగా ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో కాజల్, యష్‌తో కలిసి తెరపై కనిపించబోతోంది. AI ద్వారా రూపొందించిన ఈ ఫ్యాన్ ఎడిట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వంటి స్టార్లు ఈ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఊహకు రూపమిచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, జూలై 24న విడుదల కానున్న నితేష్ తివారి ‘రామాయణ’ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు













