Last Updated:
జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై GT 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు సాధించింది. శుభమన్ గిల్ 88, సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 అద్భుతంగా రాణించారు.
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ దుమ్మురేపింది. ముఖ్యంగా ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో GT నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. గిల్ 44 బంతుల్లో 88 (9 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు సాధించగా.. సాయి 36 బంతుల్లో 55 (6 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు బాదాడు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు కేవలం 10.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. ఇక వీరిద్దరు ఔటైన తర్వాత వచ్చిన బట్లర్ (13) త్వరగా ఔటయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (37), రాహుల్ తెవాటియా (14) వేగంగా పరుగులు చేయడంతో జీటీ భారీ స్కోర్ సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా, బ్రిజేష్ శర్మ, యష్ పుంజా చెరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













