Sachin at AU : మనస్సాక్షిని చంపుకోవద్దు..సచిన్ భావోద్వేగం | ACTPnews

Sachin at AU : మనస్సాక్షిని చంపుకోవద్దు..సచిన్ భావోద్వేగం



క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోమవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో సందడి చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న కూడా ఒక ప్రొఫెసర్, ఆయనకు చదువు అంటే ప్రాణం. మేము ఎంతో సామాన్య నేపథ్యం నుంచి వచ్చాము, కేవలం రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవాళ్లం” అని తన మూలాలను గుర్తు చేసుకున్నారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనస్సాక్షిని చంపుకోవద్దని విద్యార్థులకు హితబోధ చేశారు. ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధమని, తాను నెట్స్లో చేసిన కఠిన సాధన వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని సచిన్ వివరించారు. ఏయూ నుంచి వచ్చిన ఎంతోమంది మేధావులు దేశ విదేశాల్లో రాణించడం గర్వకారణమని ఆయన కొనియాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *