వైష్ణవి చైతన్య:
బేబి సినిమాతో సెన్సేషన్ డెబ్యూ ఇచ్చిన వైష్ణవి చైతన్య కూడా షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చింది. క్షణం ఒక యుగం, మిస్సమ్మ, ప్రియతమా, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇలా చాలా షార్ట్ ఫిలింస్ చేసింది. ఓ వైపు షార్ట్ ఫిలింస్ చేస్తూనే.. మరోవైపు టచ్ చేసి చూడు, అలా వైకుంఠపురంలో, రంగ్‌దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేసింది. ఇక బేబి సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఆ బ్యూటీ లవ్మీ, జాక్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె నటించిన ఎపిక్ రిలీజ్‌కు రెడీగా ఉంది.













